Saturday 22 December 2012

ఆదునిక ప్రపంచం .......తరుగుతున్న మానవత్వ విలువలు

మనిషి  ఆదునిక  ప్రపంచంలో సాధిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చూసి  ఆనందించాలో లేక  రోజు రోజుకు దిగజారుతున్న నైతిక విలువలు చూసి బాదపపడలో తెలియని స్తితి ని ఆదునిక ప్రపంచం నేడు మన ముందు ఉంచింది. ఢిల్లీ బస్సు లో జరిగిన బాధాకరమైన సంగటన ద్వరా స్త్రీల ఫై జరుగుతున్న అనాగరిక  అత్యాచారాల గురించి  మరోసారి వార్త పత్రికలో మనం చూస్తున్నాం. ఇలాంటి సంగటనలు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం కాదు దేసవ్యప్తంగా ఎంతో మంది స్త్రీలు మరియు పిల్లలు లైంగిక వేదింపులకు, అత్యాచారాలకు  గురిఅవుతున్నరు కానీ వెలుగులోకి వచ్చే సంగటనలు మాత్రం చాల తక్కువ. ఇలాంటి గటనలు జరిగినప్పుడు నిందితులుకు కటినమైన శిక్ష పడే విధంగా చట్టాలు అమలుపరచడం చాల అవసరం కానీ కేవలం చట్టాలు మాత్రమే పరిష్కార మార్గాలు అనుకుంటే పొరపాటే. నిజమైన సమాజ శ్రేయస్సు  చట్టాల చేతుల్లో కంటే  సమాజం చేతుల్లోనే ఎక్కువ  వుంది. నేటి వికృత చేష్టల పాలిట ప్రధాన నిందితులు అవిచేసే వాళ్లు  కంటే  వాళ్ళు అలా పైశాచికులుగ తయారు కావడానికి దారితీసిన పరిస్తితులు అని చెప్పాలి. ఈ  పరిస్తితులకి కారణాలు వెతికితే అందులో మనం  రోజు చూస్తున్న టీవీ, సినిమా, విధ్యా విధానం మరియు సామజిక విలువలు  దగ్గరి నుంచి కుటుంబం లో పిల్లలు తల్లితండ్రులు దగ్గరి నుండి  పొందుతున్న ప్రేమానురాగాల వరకు ఇమిడి వుంటాయి . ఎవరికివారు  తమ పిల్లల పెంపకంఫై శ్రద్ధ పాటించక పొతే తిరిగి వారే  బవిష్యత్  బదితలుగ మారవలిసివస్తుంది.  నేడు ఢిల్లీలో జరిగిన సంగటన ప్రతి గల్లిలో జరగకుండా ఉండాలంటే దాన్ని అరికట్టకలిగిన శక్తీ నేటి సమాజం చేతుల్లోనేవుంది.